Wednesday 21 June 2017

"కూర్గ్" విశేషాలు

"అబ్బె" జలపాతం, కూర్గ్.


ఒకే చోట నుండి మొదలైంది మా ప్రయాణం అనుకున్నట్టుగా...
రెండవ సారి వస్తుందో రాదో ఆ అవకాశం తెలియదుగా!...
"మూడు రోజులు మావే!" అన్నట్లు దొరికింది మాకు విరామం ఊహించనట్టుగా! ...
నాలుగు చక్రాల బండిలో బయలుదేరాము మా "టూరు"లోని ఆ ఊరుకు ఎంతో సంతోషంగా...
ఐదు హృదయాలు ఒక చోట చేరిన ఆ వేళ, పలకరించుకున్నాయి స్నేహంగా...
ఆరు గంటలు నిర్విరామంగా గడిచిన ఆ ప్రయాణానికి స్వస్తి పలికి వేడి దుస్తులను ధరించాం అక్కడికి చేరగా..
సప్త స్వరాలను మేళవించిన కోకిల గానంతో నిండింది ఆ చల్లని ప్రదేశం ప్రశాంతంగా 
అష్టదిగ్బంధనం చేసిన పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆ వసతిగృహాన్ని చూసి మనసుకు అనిపించింది ఎంతో హాయిగా...
నవరత్నాలు పొదిగిన దైవంలా అనిపించింది మాకు ఆ మేఘాలు మమ్మల్ని కప్పుతుంటే   వేగంగా ...
పది నిముషాల పాటు పరవళ్ళు తొక్కుతున్న ఆ జలపాత సవ్వడులుకు అయ్యాము నిశ్చలముగా...
నలభై ఎనిమిది గంటలు చరవాణీలలో చర్చలు లేకుండా గడిచిపోయాయి ఎంతో తీరికగా...
రోజులు నిముషాలుగా గడిచిన ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి వచ్చేశాము దిగులుగా... 

ఎన్నో జ్ఞాపకాలు, మర్చిపోలేని సంఘటనలు, కొత్త ప్రదేశాలు, వైవిధ్య జీవనవిధానాలు, ఊహించని ప్రశాంతత - అన్నిటినీ తనలో పొందుపరుచుకొని తనని కలవటానికి వచ్చే వారిని ఎంతో సులువుగా తన వారిగా తన ప్రకృతి  ఒడిలో ఒదిగిపోయేలా చేసుకోగల ప్రదేశం...
చూడని వారిని రమ్మని తన ఆదేశం...వెళ్ళమని నా సందేశం...ఇది కాదు ఏమి వేరే దేశం...
అది మన భారతదేశంలోని ప్రదేశం... 
              
          "కొడగు" అని అపరిచితమైన పేరు...
                             "కూర్గ్"గా అందరికీ సుపరిచితమైన ఊరు.  

2 comments:

  1. అబ్బ బ్బా! నీవు వ్రాసిన కవిత మమ్మల్ని వెళ్ళమని పెట్టిన తొందర ఎందుకురా! కలిగించినావు తొందర
    ఇక నుండి మేము అవుతాము చిందర వందర.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు అక్క...తప్పకుండా వెళదాము చిందర వందర పడక :)

      Delete

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...