Posts

వీక్షకులు

"కూర్గ్" విశేషాలు

Image
ఒకే చోట నుండి మొదలైంది మా ప్రయాణం అనుకున్నట్టుగా...
రెండవ సారి వస్తుందో రాదో ఆ అవకాశం తెలియదుగా!...
"మూడురోజులు మావే!" అన్నట్లు దొరికింది మాకు విరామం ఊహించనట్టుగా! ...
నాలుగు చక్రాల బండిలో బయలుదేరాము మా "టూరు"లోని ఆ ఊరుకు ఎంతో సంతోషంగా...
ఐదు హృదయాలు ఒక చోట చేరిన ఆ వేళ, పలకరించుకున్నాయి స్నేహంగా...
ఆరుగంటలు నిర్విరామంగా గడిచిన ఆ ప్రయాణానికి స్వస్తి పలికి వేడి దుస్తులను ధరించాం అక్కడికి చేరగా..
సప్త స్వరాలను మేళవించిన కోకిల గానంతో నిండింది ఆ చల్లని ప్రదేశం ప్రశాంతంగా 
అష్టదిగ్బంధనం చేసిన పచ్చని చెట్ల మధ్య ఉన్న ఆ వసతిగృహాన్ని చూసి మనసుకు అనిపించింది ఎంతో హాయిగా...
నవరత్నాలు పొదిగిన దైవంలా అనిపించింది మాకు ఆ మేఘాలు మమ్మల్ని కప్పుతుంటే   వేగంగా ...
పది నిముషాల పాటు పరవళ్ళు తొక్కుతున్న ఆ జలపాత సవ్వడులుకు అయ్యామునిశ్చలముగా...
నలభై ఎనిమిది గంటలు చరవాణీలలో చర్చలు లేకుండా గడిచిపోయాయి ఎంతో తీరికగా...
రోజులు నిముషాలుగా గడిచిన ఆ వాతావరణాన్ని విడిచిపెట్టి వచ్చేశాము దిగులుగా... 

ఎన్నో జ్ఞాపకాలు, మర్చిపోలేని సంఘటనలు, కొత్త ప్రదేశాలు, వైవిధ్య జీవనవిధానాలు, ఊహించని ప్రశాంతత - అన్నిటినీ తనలో ప…

సాంకేతిక విజ్ఞానం-పరిమితులతో కూడిన జ్ఞానం

Image
సాంకేతిక విజ్ఞానం మనుషులను అనుకోనంత ఎక్కువగా అందుకోలేనంత ఎత్తులకు తీసుకెళ్ళింది, ప్రయోజకులను కూడా చేసింది. అయితే దీనివల్ల దుష్ప్రయోజనాలు లేకపోను లేదు.

ముఖ్యంగా మన చేతులను ఇట్టే కట్టేసి అట్టా నట్టింట్లో నుంచి "నెట్" ఇంట్లోకి నెట్టేసి ఒక పట్టాన విడువనివ్వక "నట్" బిగించినట్టు అట్టే పట్టేసి చుట్టు పక్కల ఏమి జరుగుంతుందో అంతుపట్టనీయకుండా చేసే చరవాణీలు.
మనిషి తన తోటి వారికి "అరెరే!" అని సహాయపడటం ఆదమరిచాడు, చరవాణీలలోని సంఘటనలకు "భళా!" అని స్పందిస్తూ అసలు దారే మరిచాడు.   

తల్లిదండ్రులతో, తోటి స్నేహితులతో సరిగ్గా గడపలేని స్థితి...ఇది మనఃస్థితి కాదు...మన స్థితి...మనం కోరి తెచుకున్న దుస్థితి.
మనం వాడే ఈ ఫేసుబుక్ లు, వాట్సాప్ లు, ఇన్స్టాగ్రాం లు మనకి కొంతలో కొంత...చాలా కొంత మాత్రమే ఉపయోగపడతాయి... "నెట్" ఇంట్లో ఉన్న మనుషులను కాదు, ముందు నట్టింట్లో, నీ చుట్టూ ఉన్న మనుషులను గుర్తించు...   కళ్ళు నలుపు..
పెదవి కదుపు..
మాట కలుపు...

ఇంట్రెస్టు  లేకున్నా ఇంత రెస్టు కూడా లేకుండా చేసే ఈ పనులు, మనపై ఇంతగా ప్రభావం చూపే ఇటువంటి సాంకేతిక విజ్ఞానం యొక్క పరిమితులను తెలుస…

ఎటు వైపు?! ఆలోచిద్దాం...

"చదువు ఎంతో ముఖ్యం" అంటుంది సమాజం.
"చదువు లేనిదే బ్రతకలేవు" అంటుంది మా గృహం.
"చదువుని ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చెయ్యద్దు" అన్నారు నా గురుదైవం.
"చదువుకోకపోతే నిన్ను ప్రశాంతంగా వదలను!!" అంటుంది నా బ్యాంకు ఋణ భారం.
"చదువు కాక?! ఏంటి నీ దారిక?!" అని నా తోటి వారు నన్ను ప్రశ్నించటం...నెలకొల్పింది నాలో గందరగోళం .
"చదువు నాకు కష్టం,వేరే ఉంది నా ఇష్టం" అంటుంది నా హృదయం.
"అవసరం వేరు, ఇష్టం వేరు...చదువు నీ అవసరం, ఇష్టం నీ బలం" అని చెప్పింది ఓ స్నేహం.   
"చదువుతోనేనా నీ సావాసం?!" త్వరగా తేల్చుకో అంటుంది సమయం.

ఇప్పటికి చదువుతో కావచ్చు నా పయనం!!
కాని తల వంచక, పట్టుదల విడువక చేసే నా ప్రయత్నం
ఖచ్చితంగా నా ఇష్టం వైపే ఉంటుంది నా గమనం.  

నా బోటి వారు ఎందరో, కాని ఇష్టం వైపు నడిచేది కొందరే...
ప్రశాంతంగా ఆలోచిద్దాం... కంగారుపడక! ఇష్టం వైపు అడుగులు వేద్దాం.

"సిరివెన్నెల" గారికి జన్మదిన శుభాకాంక్షలు

Image
అందలేనంత దూరంలోని ఆకాశంలో ఆ "వెన్నెల" ఉండటం ఎంతో అందం.
అందరికీ చేరువలోని సినీ ప్రపంచానికి ఈ "సిరివెన్నెల" దొరకటం ఎంతో ఆనందం.

"నమ్మకమే నాన్న అయ్యి నడపాలిర ఇకపైనా అని చెప్పిOది ...అమ్మ చెప్పింది" అని తండ్రి     కోసం పిల్లవాడు పడే తపన గురించి తెలుపుతూ,
 "మాయలే నమ్మింది,బోయతో పోయింది...పారిపోనీకుండా      పట్టుకో నా చేయి " అంటూ  పిల్లల కోసం తపన పడే తండ్రి ఆవేదన గురించి అందించారు.

 "చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా! కిందికొచ్చి నీలా మారిందా" అని తెలుగింటి  ఆడపిల్లలను వర్ణిస్తూ,

"ముసుగు వెయ్యద్దు మనసు మీద,వలలు వెయ్యద్దు వయసు మీద" అంటూ వయసులోని ఆడవారి ఆవేశాన్ని చూపించారు.

  "సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి                          మంటపాన" అని వధూవరుల గురించి ఎంతో మనోహరముగా ముచ్చటిస్తూ

"వాన విల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో...ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి " అంటూ మన పెళ్ళికథలను యథావిథిగా వినిపించారు.

"ఆనతినీయరా హరా! సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా!"…

సచిన్--కోట్ల గుండెల అలికిడి

Image

నా మిత్రుడు

Image
అనుకోని పరిస్థితిలో ఎదురైన ఆ సమస్య
తడుముకోకుండా తరిమి కొట్టిన మీ తల్లిదండ్రులకు,అన్నయ్యకు నాపాదాభివందనములు.
నీ వెన్నంటే నిలిచిన మీ పెద్దవారికి నాధన్యవాదములు.
తమ రక్షణ కర్తవ్యమును నిరూపించుకున్న ఆ వైద్యులకు నాప్రశంసలు.
భయపడకుండా తనని తాను నమ్మి నిలిచిన నా మిత్రునకు వర్ణించలేనిఅభినందనలు.

ప్రయత్నించు ప్రయత్నించు,ఎప్పటికీ నీ పట్టుదల విడువక
నువ్వు కోరుకునట్టుగానే ఒక్క నెలలోనే సాగిస్తావు నీ నడక
కుదిరినంత త్వరగానే లేచి పరిగెడతావు దిగులు పడక
నీ పట్టుదలకు తల వంచి వదిలెయ్యదా నిన్ను ఆ పడక 
ఇలా ఎంతో చెప్పాలి అని ఉంది ఉద్వేగంగా,
కాని "మనం అనుకున్నట్టు" కలిసి మాట్లాడుకుందాం తీరికగా...

 ఇట్లు,
                                                                                     నీ ప్రియమిత్రుడు ,
                                                                                       స్వరూప్  గోలి.

అమ్మ కాని అమ్మ "చెల్లెమ్మ"

Image
అలవాటుగా  "అన్నయ్య" అన్నది అంటే ప్రేమగా మాట్లాడుతుందని అర్థము
పొరపాటుగా  "ఏరా" అన్నది అంటే అది తన కోపానికి చిహ్నము
అపూర్వముగా  "ఏరా అన్నయ్య!!" అని పలికింది అంటే, నీ కష్టాలను పంచుకోటానికి సిధ్ధంగా ఉంది అని తాత్పర్యము .

అమ్మకు పర్యాయపదం, 
             తల్లి తరువాత అంతగా ప్రేమించే పిచ్చి తల్లి, 
                                                           అమ్మ కాని అమ్మ "చెల్లెమ్మ"...

నీతో పోట్లాడుతుంది,కొట్లాడుతుంది
గెలిస్తే నిన్ను కావాలని ఏడిపిస్తుంది
ఓడిపోతే తట్టుకోలేక ఏడుస్తుంది
నువ్వు తనపై కోపంగా ఉన్నా తనే వచ్చి హత్తుకుంటుంది
తనునీపై కోపంగా ఉన్నా తనే వచ్చి పలకరిస్తుంది 
రక్షాబంధనమై నీకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది

అమ్మ తరువాత అంత ఓపిక కనబరిచి జలదరింపచేస్తుంది
పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతూ కళ్ళు "జల ధరించే"లా చేస్తుంది...