Thursday, 30 March 2017

"తాత-మనవడు"

ఆయన మన నాన్నకు నాన్న.

అమ్మ అమ్మని అమ్మమ్మ అంటాము.

కాని మరి నాన్న నాన్నని?!
 చిన్న పిల్లలు మొదట సులువుగా పలికే అక్షరం...మాట... "తా"నే.

         అది ఒకసారి అంటే "తా" ...రెండు సార్లు అంటే "తాతా"...అదే ప్రేమగా అంటే ఆయనే "తాత"...

అలా ఆయన మనకి "తాత" అయ్యాడు...ఆ "తాత"కి ఈ బుల్లోడు "మనవడు" అయ్యాడు...
               
కొడుకు అల్లరి చేస్తే ఒక దెబ్బ వేస్తాడు  నాన్న ...
కాని చిన్ననాటి తన కొడుకు అల్లరిని తన మనవడిలో చూసుకొని మురిసిపోతాడు తాత...
తన పోలికలను తన మనవడి లో చూసుకొని ఎంతో మురిసిపోయే అల్ప సంతోషి తాత...
తన మనవడి సంరక్షణే తనకు ప్రియంగా భావించేవాడు తాత...
మనవడు తప్పటడుగులు వేస్తే తనని మంచి దారిలో నడిపిస్తాడు తాత...
పెరిగి పెద్దవాడై తడపడుతూ అడుగులు వేసే తన తాతని నడిపిస్తాడు మనవడు...  

ఆ బాంధవ్యమే "తాత-మనవడు" బంధమై,ఆ బంధానికి దూరమైన ఎన్నో కుటుంబాలను కలిపింది...ఇప్పటికీ ఆ బంధాన్ని నిలిపింది...గుండెలకు హత్తుకుపొయే ప్రేమై కుటుంబాలలో నిలిచింది...

Tuesday, 28 March 2017

మన తెలుగువాడి "ఉగాది"

"ఈ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా?!" అడిగాను ఆత్రంగా...
నా తోటి విద్యార్థి చూసాడు నన్ను విచిత్రంగా...
"నా పుట్టిన రోజు ఏమి కాదే!!" అన్నాడు చమత్కారంగా...
"ఆచారాలకు పునాది గా భావించే మన భారతదేశం లో
ఉంటూ ప్రత్యేకత ఎమిటో తెలియదా?!" అందామని అనుకున్నా ఆవేశంగా...
"ఇంతకీ ఏమిటది  చెప్పరా?!" అన్నట్టు చూస్తున్నాడు వింతగా...
మన తెలుగు నూతన సంవత్సర పండుగ "ఉగాది" రా!!" అన్నాను నిస్సహాయంగా...


ఇంతలోకి కండక్టరు "బాబు! ఏ ఊరు మనది?!" అని నిద్రపోతున్న నన్ను లేపాడు చిరాకుగా...

  కళ్ళు నలుపుకొని , సంఘటన గుర్తుచేసుకొని, నాలో నేను నవ్వుకొని,
  ఆటో మాట్లాడుకొని, ఇంటికి చేరుకొని,
  ఉదయం నాన్న చేతి ఉగాది పచ్చడి పుచ్చుకొని
  మధ్యాహ్నం అమ్మ చేతి కమ్మని వంటకాలు ఆరగించి అరిగించుకొని 
  సాయంత్రం పంచాంగ శ్రవణం ముగించుకొని
  "ఉగాది"ని గడిపాను హాయిగా...


  అన్నట్టు అందరికీ "హేవళంబి" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Friday, 24 March 2017

_/\_ పితృదేవోభవ _/\_

నాన్న-

నీకు మొదటి గురువు...
నువ్వు ఆడుకుంటుంటే గుండెలపై ఆనందంగా మోస్తాడు ఆ బరువు...
ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ప్రేమగా నీ యొక్క ఆలింగనంతో చలించిపోదా ఆ తనువు...
           

        "ఒక కొడుకు గల తండ్రికి అంతకు మించిన ధైర్యం ఉండదు....
          ఒక కూతురు గల తండ్రికి అంతకు మించిన ప్రేమ ఉండదు..."  
 
ఒక మహావృక్షం తన విత్తనం నుంచి పెరగటానికి అవసరం ఋతువు ... 
ఒక గొప్ప మనిషి తన బాల్యం నుంచి ఎదగటానికి తండ్రి అండ అవసరం అనటానికి ఇదే ఋజువు .

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...