Thursday 30 March 2017

"తాత-మనవడు"

ఆయన మన నాన్నకు నాన్న.

అమ్మ అమ్మని అమ్మమ్మ అంటాము.

కాని మరి నాన్న నాన్నని?!
 చిన్న పిల్లలు మొదట సులువుగా పలికే అక్షరం...మాట... "తా"నే.

         అది ఒకసారి అంటే "తా" ...రెండు సార్లు అంటే "తాతా"...అదే ప్రేమగా అంటే ఆయనే "తాత"...

అలా ఆయన మనకి "తాత" అయ్యాడు...ఆ "తాత"కి ఈ బుల్లోడు "మనవడు" అయ్యాడు...
               
కొడుకు అల్లరి చేస్తే ఒక దెబ్బ వేస్తాడు  నాన్న ...
కాని చిన్ననాటి తన కొడుకు అల్లరిని తన మనవడిలో చూసుకొని మురిసిపోతాడు తాత...
తన పోలికలను తన మనవడి లో చూసుకొని ఎంతో మురిసిపోయే అల్ప సంతోషి తాత...
తన మనవడి సంరక్షణే తనకు ప్రియంగా భావించేవాడు తాత...
మనవడు తప్పటడుగులు వేస్తే తనని మంచి దారిలో నడిపిస్తాడు తాత...
పెరిగి పెద్దవాడై తడపడుతూ అడుగులు వేసే తన తాతని నడిపిస్తాడు మనవడు...  

ఆ బాంధవ్యమే "తాత-మనవడు" బంధమై,ఆ బంధానికి దూరమైన ఎన్నో కుటుంబాలను కలిపింది...ఇప్పటికీ ఆ బంధాన్ని నిలిపింది...గుండెలకు హత్తుకుపొయే ప్రేమై కుటుంబాలలో నిలిచింది...

No comments:

Post a Comment

కొత్త కాలమానం - ఆపరేషన్ 2020

జననమరణముల నడుమ ఉనికి తెలుపుతూ, బ్రతుకుతెరువు కొరకు గళమునెత్తుతూ, గెలుపు రథమునెక్కుటకు కదము తొక్కుతూ, విధాత రాతను శిరసా వ...