అలవాటుగా "అన్నయ్య" అన్నది అంటే ప్రేమగా మాట్లాడుతుందని అర్థము
పొరపాటుగా "ఏరా" అన్నది అంటే అది తన కోపానికి చిహ్నము
అపూర్వముగా "ఏరా అన్నయ్య!!" అని పలికింది అంటే, నీ కష్టాలను పంచుకోటానికి సిధ్ధంగా ఉంది అని తాత్పర్యము .
అమ్మకు పర్యాయపదం,
తల్లి తరువాత అంతగా ప్రేమించే పిచ్చి తల్లి,
అమ్మ కాని అమ్మ "చెల్లెమ్మ"...
నీతో పోట్లాడుతుంది, కొట్లాడుతుంది
గెలిస్తే నిన్ను కావాలని ఏడిపిస్తుంది
ఓడిపోతే తట్టుకోలేక ఏడుస్తుంది
నువ్వు తనపై కోపంగా ఉన్నా తనే వచ్చి హత్తుకుంటుంది
తను నీపై కోపంగా ఉన్నా తనే వచ్చి పలకరిస్తుంది
రక్షాబంధనమై నీకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది
అమ్మ తరువాత అంత ఓపిక కనబరిచి జలదరింపచేస్తుంది
పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతూ కళ్ళు "జల ధరించే"లా చేస్తుంది...

ధన్యవాదాలు ఓ తమ్ముడా! చక్కగా చెప్పి కంట తడి పెట్టించినావు 😌☺️😍😙
ReplyDelete