రాముడు మంచి బాలుడు కదండీ
అన్నదమ్ములు అంటే రామ-లక్ష్మణులు లాగ ఉండాలి అంటారు కదండీ
ఆజానుబాహుడు అని రాముడి తోనే పోలుస్తారు కదండీ
తిరగేసి "మరా" "మరా" అని చదివినా అదే మహిమ చూపించే అమృతమైన అమోఘమైన అత్యద్భుతమైన పలుకు "రామ" నే కదండీ
తన తండ్రి మాట కోసం "వనవాసం" చేస్తూ, వెంట వచ్చిన భార్యతో కలిసి చక్కని "నివాసం"గా మార్చుకున్న గాధ "సీత-రామ" కథనే కదండీ
కోదండరాముడి కోసం వానరదండుతో అండగా నిలిచి అదే తన శక్తిగా చేసిన రామ-హనుమల భక్తి వాత్సల్యాలు సాటిలేనివి కదండీ
మన జీవితానికి ఇన్ని పాఠాలు నేర్పి,అంతంత చేరువై,ఎంతో అచ్చెరువు కలిగించే శ్రీరామచంద్రుడి జన్మదినాన ఏమి చెయ్యగలమండీ
భక్తి శ్రధ్ధలతో రామకోటి రాస్తూ,శతకోటి దండాలు చేస్తూ,అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుందాం రారండీ

No comments:
Post a Comment