చదువు "కుం(కొం)టున్నామా?!" |
ఒక విషయాన్ని తట్టుకుంటే అది ఓర్పు
ఓర్పు నశిస్తే కలిగేది బాధ
బాధను దిగమింగుకోలేకపోతే పుట్టేది వేదన
వేదన పెరిగితే మొదలయ్యేది ఆందోళన
ఆందోళన హెచ్చితే సంభవించేది తిరుగుబాటు
అలాంటి ఓర్పుని పరీక్షించి, బాధని కలిగించి, వేదన పుట్టించి, ఆందోళనపరిచి, ఆఖరికి తిరుగుబాటు కూడా మొదలయ్యేలా చేసిన తరువాత కూడా, అందుకు ప్రేరేపించిన కారణాలను, నిర్ణయాలను కనీసం పరిగణించకుండా, వాళ్ళ మనవిని తొక్కేసి, పిల్లల అభివృధ్ధే ప్రధముగా భావించే తల్లిదండ్రుల శ్రమదానం నుండి వచ్చిన డబ్బుతో, విద్యార్థులకు ఏ మాత్రం వెసులుబాట్లు కలిపించకుండా మునుపటిలానే సాగిపోదాం అనుకునే ప్రతీ ఒక్క విద్యాసంస్థ కాదు కాదు వ్యాపారసంస్థలకు- ఇది హెచ్చరిక కానే కాదు. మీకు పనికిరాని, అర్థంకాని ఒక సగటు విద్యార్థి వేదన, తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఆందోళన.
ఇందుకు తీవ్ర పరిణామాలను భావి తరాల నుండి ఎదుర్కొనవలసి రావచ్చు. సిధ్ధముగా ఉండగలరు ఆయా సంస్థలవారు.
No comments:
Post a Comment