"ఈ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా?!" అడిగాను ఆత్రంగా...
నా తోటి విద్యార్థి చూసాడు నన్ను విచిత్రంగా...
"నా పుట్టిన రోజు ఏమి కాదే!!" అన్నాడు చమత్కారంగా...
"ఆచారాలకు పునాది గా భావించే మన భారతదేశం లో
ఉంటూ ప్రత్యేకత ఎమిటో తెలియదా?!" అందామని అనుకున్నా ఆవేశంగా...
"ఇంతకీ ఏమిటది చెప్పరా?!" అన్నట్టు చూస్తున్నాడు వింతగా...
మన తెలుగు నూతన సంవత్సర పండుగ "ఉగాది" రా!!" అన్నాను నిస్సహాయంగా...
ఇంతలోకి కండక్టరు "బాబు! ఏ ఊరు మనది?!" అని నిద్రపోతున్న నన్ను లేపాడు చిరాకుగా...
కళ్ళు నలుపుకొని , సంఘటన గుర్తుచేసుకొని, నాలో నేను నవ్వుకొని,
ఆటో మాట్లాడుకొని, ఇంటికి చేరుకొని,
ఉదయం నాన్న చేతి ఉగాది పచ్చడి పుచ్చుకొని
మధ్యాహ్నం అమ్మ చేతి కమ్మని వంటకాలు ఆరగించి అరిగించుకొని
సాయంత్రం పంచాంగ శ్రవణం ముగించుకొని
"ఉగాది"ని గడిపాను హాయిగా...
అన్నట్టు అందరికీ "హేవళంబి" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

బాగా రచించావు ఓ తమ్మ్ముడా!
ReplyDelete