మనిషి! ఓ మనిషి!
చిత్రమైన జీవితం
వీడలేవు మూర్ఖత్వం
ఏ బిడ్డ పుడుతుందో తెలుసుకోవటానికి స్కాన్నింగ్ లు తీయిస్తావు
ఆడ బిడ్డ అని తెలిస్తే ఎబాషన్ లు చేయిస్తావు!!!
చదువుకోవాలని నీ పిల్లల్ని బడికి పంపిస్తావు
చదువుకోవాల్సిన పిల్లల్ని పనుల్లో పెడతావు!!!
డబ్బులు సంపాదించటం కోసం ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుతావు
పెళ్ళి చేసుకొని కట్నం కోసం భార్యని వేధిస్తావు!!!
పర్యావరణ రక్షణ ఎంతో ముఖ్యం అని పాఠాలు చెప్తావు
అదే పర్యావరణాన్ని పాడుచెయ్యటానికి నీ వంతు సాయం చేస్తావు!!!
కులాలకు,మతాలకు మేము అతీతం అంటావు
నిన్ను పాలించే వాడిని వాటి నుంచే పుట్టిస్తావు!!!
దోచుకునే వాడితో డీలింగ్ లు చేస్తావు
కష్టపడే వాడితో బార్గేనింగ్ లు చేస్తావు!!!
కనిపించే దైవం తల్లిదండ్రులు అంటావు
కనిపించకుండా వాళ్ళని వృధ్ధాశ్రమాల్లో వదిలేస్తావు!!!
భారతీయులంతా నా సోదరీసోదరులు అంటావు
ప్రేమించలేదని వాళ్ళ మీద ఆసిడ్ దాడులు చేస్తావు!!!
ఆధునిక యుగం లో ఉన్నా అని గర్వపడతావు
నైతిక విలువలు తెలియకుండా బ్రతికేస్తావు!!!
ఎక్కడ మనిషి? ఎవ్వరు మనిషి?

No comments:
Post a Comment