అలసి వచ్చెను అతను
తనువు కోరెను కునుకు
వలస వెళ్ళెను ఆలోచనలు
తలచి చూసెను నయనములు
కలసి వచ్చెను ఘడియలు
వేచి చూసెను ఇరు సంధ్యలు
దారిగా మారెను పయనములు
మౌనంగా కరిగెను క్షణములు
ప్రేమగా మారెను ఎదురుచూపులు
ఇంటికి చేరెను అడుగులు
రమ్మని అహ్వానించెను బంధువులు
తనని చుట్టుముట్టెను కన్నీళ్ళు
చెవులకు వినిపించెను ఆర్తనాదములు
దేవుడిని కోరెను చేతులు
ధారాళంగా చెమర్చెను కళ్ళు
నిద్ర నుంచి లేచెను ఒళ్ళు
అన్యమనస్కతతో చూసెను దిక్కులు
వలస వెళ్ళిన ఆలోచనలు దరికి రాకూడని పీడకలలు అని తెలిసెను ..
ఉషస్సులోనే చరవాణిలో ఇంటికి చేసి కలిపెను మాటలు
అమ్మ పలుకుతో, నాన్న నవ్వుతో కుదుటపడెను అతని ప్రతిస్పందనలు .
No comments:
Post a Comment