ప్రశాంతంగా ఉన్న ఓ సాయంకాలాన
అందరూ ఇళ్ళకు తిరిగి వెళుతున్న సమయాన
రాకపోకలు జోరుగా సాగుతున్న దారిలోన
రెండు వాహనాలు ఢీ కొట్టుకున్నవి ఒక వీధి లోన
తప్పుగా రైట్ సైడ్ వచ్చినవాడు
తనదే రైట్ అని కళ్ళు ఉరిమాడు!
రైట్ గా లెఫ్ట్ సైడ్ వచ్చినవాడు
తప్పు లేకున్నా తప్పుకొని తగ్గిపోయాడు!
ఒకడు "భయపెట్టాను రా!" అని సంబరపడి,
మరొకడు "బతికిపోయాను రా!" అని సంతోషపడి వెళ్ళిపోయెను!