https://www.inshorts.com/news/8monthold-critical-after-being-raped-by-28yearold-cousin-1517291735798
ఎవరిని ప్రశ్నించగలను?!
"రేయ్! లంజకొడకా!!" అని తిడితే తీరిపోని నా ఈ కోపాన్నా?!
" 'అడవిలోనే' క్రూరమృగాలు ఉంటాయి!" అన్నవారి అమాయకత్వాన్నా?!
కామ, క్రోధ, కోరికలతో కప్పుకుపోయిన దరిద్రపు దేహాల్నా?!
చట్టం రూపంలో వెంటనే సంకెళ్ళేసేసిన మన రాజ్యాంగాన్నా?!
"శతవృధ్ధరూపం ధరించి వార్ధక్యంలో ఉన్న మన చట్టాలు, బంధిఖానాలు మమ్మల్ని ఏమి చెయ్యలేవు!" అనుకునే వాళ్ళ ధైర్యాన్నా?!
"మండలముల వ్యవధిలోనే బయటకి వచ్చి స్వైరవిహారం చెయ్యగలము" అనుకునే వారి నమ్మకాన్నా?!
"తెలుసుకొని కూడా ఏమి చెయ్యలేకపోతున్నానే!" అన్న నా యేహ్యాన్నా?!
"హు! ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి!" అని తోటి వారు కూసినప్పుడు తన్నుకువచ్చే నా ఆవేశాన్నా?!
ప్రతిబంధకం లేని అర్జునుడిలా ఇలాంటి వారిపై కనీసం శరం కూడా సంధించలేని నా దుస్థితినా?!
ఎవరినని ప్రశ్నించగలను ?!