అందలేనంత దూరంలోని ఆకాశంలో ఆ "వెన్నెల" ఉండటం ఎంతో అందం.
అందరికీ చేరువలోని సినీ ప్రపంచానికి ఈ "సిరివెన్నెల" దొరకటం ఎంతో ఆనందం.
"నమ్మకమే నాన్న అయ్యి నడపాలిర ఇకపైనా అని చెప్పిOది ...అమ్మ చెప్పింది" అని తండ్రి కోసం పిల్లవాడు పడే తపన గురించి తెలుపుతూ,
"మాయలే నమ్మింది,బోయతో పోయింది...పారిపోనీకుండా పట్టుకో నా చేయి" అంటూ పిల్లల కోసం తపన పడే తండ్రి ఆవేదన గురించి అందించారు.
"చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా! కిందికొచ్చి నీలా మారిందా" అని తెలుగింటి ఆడపిల్లలను వర్ణిస్తూ,
"ముసుగు వెయ్యద్దు మనసు మీద,వలలు వెయ్యద్దు వయసు మీద" అంటూ వయసులోని ఆడవారి ఆవేశాన్ని చూపించారు.
"సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన" అని వధూవరుల గురించి ఎంతో మనోహరముగా ముచ్చటిస్తూ
"వాన విల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో...ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి " అంటూ మన పెళ్ళికథలను యథావిథిగా వినిపించారు.
"ఆనతినీయరా హరా! సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా!" అని అద్వితీయమైన గురుభక్తిని గుర్తుచేస్తూ ,
"ఆ యమపాశమె పూదండవదా నీ మెడలో...శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం అంటూ దైవశక్తిని మనకు అందించి అండగా నిలుచున్నారు.
మీ ఎన్నో ఆలోచనలను ఆచరణలో పెట్టి,ఆ పాటలను మాకు పాఠాలుగా మార్చిన శాస్త్రి గారు!
నాలా క్రొత్తగా కలం పట్టేసి రాసే వారికి పరోక్షంగా తమ రచనల సిరా చుక్కలందిస్తూ, ఎంతగానో ప్రభావితం చేశారు గురువు గారు!

మీ అనంత సాహిత్య విశేష "పద" సామ్రాజ్యంలో నూత్న పదజాలంతో ఎన్నో ఇంద్రజాలాలు చేస్తూ, మమ్మల్ని అన్ని సమయాలలో విస్మయానికి గురిచేసి, ఎన్నో కొత్త దారులు చూపించిన మీ వర్ణనాతీతమైన సాహిత్యరథానికి ఒక చిన్న తోరణముగా ఈ చిన్ని రచనను కట్టాలనే నా మనోరథాన్ని మన్నించవలసినదిగా కోరుతూ ...
జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు.
జన్మదిన శుభాకాంక్షలు గురువు గారు.