***క్షణికావేశం***
ఆవేశంలో తీసుకునే నిర్ణయంనిర్ణయం వల్ల పోయే ప్రాణం
ప్రశాంతంగా ఆలోచిస్తే దొరుకుతుంది పరిష్కారం
ప్రాణం ఖరీదు అంత ఉండదు కారణం
---ఫలితం-->
ఎటు చూసినా విషాధ ఛాయలు,అనాధలయ్యే కుటుంబాలు,
బాంధవ్యాల మధ్య వచ్చే విభేధాలు,
బంధువులు చేసే రచ్చలు,
డబ్బులు పెట్టే చిచ్చులు,
బుద్ధిలేమి బిగించే ఉచ్చులు,
మాటలు తెచ్చే మాయని మచ్చలు.
చచ్చి ఏమి సాధించటానికి??!!
ఎదుటి వారి దుఃఖానికి కారణమయ్యేకంటే,
బ్రతికి ఉండి ఆ కష్టాలను అధిగమించచ్చు కదా?!
ఆలోచించండి...
చావాలనే ఆవేశOతో కాదు, బ్రతకాలని అందులో దాగి ఉన్న 'ఆశ' తో...